పాములు పట్టే వారిని పామే కాటు వేసినట్లు అనేక సార్లు విన్నాం. అలాంటి ఘటనల్లో అనేక మంది మృత్యువాత చెందారు. తాజాగా అలాంటే ఘటనే ఇక్కడ జరిగింది. కర్ణాటకలోని మాజ్ సయ్యద్ కు పాములు పట్టడం అంటే చాలా ఇష్టం. పలు మార్లు వాటితో వీడియోలు తీసి సోషల్ మీడియోలో పోస్ట్ చేసేవాడు. ఈ క్రమంలో అతను ఒకే సారి మూడు పాములను తన ముందు పెట్టుకుని ఆడించాడు. అదే సమయంలో ఓ పాము తన కాలిపై కాటు వేసింది. దీంతో అతను అస్పత్రి పాలయ్యాడు. కానీ ప్రమాదవశాత్తు ప్రాణపాయం నుంచి తప్పించుకున్నట్లు తెలిసింది.