ఒడిశాలో వైద్య చరిత్రలోనే అద్భుతమైన ఘట్టం జరిగింది. ఓ మహిళ కడుపులో పెరుగుతున్న ఇద్దరు కవలల్లో ఒకరు 23 వారాలకు చనిపోయాడు. ఆ తర్వాత 52 రోజులకు మరో బిడ్డ జన్మించాడు. కటక్ జిల్లాకు చెందిన పార్వతీ బెహారా.. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చింది. కవలలు పెరుగుతున్నట్లు వైద్యులు చెప్పారు. 23 వారాల తర్వాత కడుపునొప్పి రావటంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఓ బిడ్డ చనిపోవటంతో తొలగించారు. అప్పట్నుంచి 52 రోజుల తర్వాత మరో బిడ్డ జన్మించాడు. కోటిలో ఒక్కరికి ఇలా జరుగుతుందట.