NCP నేత అజిత్ పవార్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. పుణెలోని ఓ ఆసుపత్రిలో పవార్ ఎక్కిన ఓ లిఫ్ట్ నాలుగో ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా కిందపడిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు. జనవరి 14నే ప్రమాదం జరిగినప్పటికీ ఈ విషయాన్ని ఎవరికీ వెల్లడించలేదని పవార్ చెప్పారు. భారమాతిలో జరిగిన ఓ కార్యక్రమంలో అజిత్ పవార్ ఈ విషయాన్ని వెల్లడించారు. తన ఫ్యామిలీకి కూడా ఇప్పటిదాకా విషయం చెప్పలేదని అన్నారు.