మెక్సికోలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్ కోతి పోలీసుల కాల్పుల్లో మృతి చెందింది. స్మగ్లర్ల బృందానికి చెందిన వాళ్లు ఈ కోతిని పెంచుకుంటున్నారు. దానికి కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ దరింపజేయగా పోలీసులకు, స్మగ్లర్లకు మధ్య జరిగిన కాల్పుల్లో అది మృతి చెందింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌లో 11 మంది స్మగ్లర్లు మృతిచెందారు. వారి వద్ద నుంచి భారీ ఆయుధాలను, వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.