వాట్సాప్.. డెస్క్టాప్ యూజర్లకు సరికొత్త ఫీచర్ను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఒకేసారి ఎక్కుమందితో చాట్స్ ఎంపిక చేసే ఆప్షన్ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ మొబైల్ వెర్షన్ను పోలి ఉంటుందని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగదశలో ఉంది. త్వరలోనే దీనిని లాంచ్ చేయాలని వాట్సాప్ భావిస్తోంది. దీనిని మొదట బీటా యూజర్లకు అందుబాటులోకి తేవాలని వాట్సాప్ యోచిస్తోంది.