భారత్‌తో జరిగిన రెండో వన్డేలో 11 ఓవర్లలో 10 వికెట్ల తేడాతో గెలిచి ఆస్ట్రేలియా సరికొత్త రికార్డు సృష్టించింది. వన్డేల్లో ఇండియాపై ఓవర్లపరంగా అత్యధిక వేగంగా లక్ష్యాన్ని చేధించిన జట్టుగా ఆసీస్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇంతకుముందు 2019లో టీమిండియా నిర్దేశించిన 93 పరుగుల టార్గెట్‌ను న్యూజిలాండ్ 14.4 ఓవర్లలోనే చేధించింది. ఇప్పటివరకే ఇదే అత్యుత్తమంగా ఉంది. ప్రస్తుతం కివీస్ రికార్డును ఆసీస్ బద్దలుకొట్టింది. మొత్తంమీద ఓవర్ల పరంగా ఆస్ట్రేలియాకు ఇది మూడో పెద్ద విజయం.