ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోవడంతో సైబర్ నేరాలు కూడా పెరిగిపోయాయి. కేటుగాళ్లు మెత్తని మాటలతో ప్రజలను మభ్యపెట్టి దోచుకుంటున్నారు. తాజగా ఓ కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్‌లో ఓ కళ్ళద్దానికి సంబంధించిన యాడ్ చూసిన నెటిజన్ దానిని కొనేందుకు ఆసక్తి చూపాడు. రూ.10,000 ఉండే ఆ కళ్ళజోడు రూ.2,000లకు రావడంతో వెంటనే దాన్ని కొన్నాడు. కానీ చివరికి వచ్చింది డూప్లికేట్ ప్రోడక్ట్. ఇలా కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ప్రజలు కూడా తక్కువమొత్తంలో నష్టపోతుండడంతో ఏమి నోరు మెదపడం లేదు. అయితే ఇలాంటి మోసాలకు కేటుగాళ్లు అధికంగా పాల్పడుతున్నారని, వారి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.