• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లాకర్ రూమ్‌లో పెద్దాయన.. తాళం వేసి వెళ్లిన సిబ్బంది

    ఓ 84 సంవత్సరాల పెద్దాయన రాత్రంతా బ్యాంకు లాకర్ రూమ్‌లోనే గడిపాడు. ఇలా చేసింది ఏదో సరదాకు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అతడు ఆ రూమ్‌లో అలా మగ్గిపోయింది బ్యాంకు సిబ్బంది పొరపాటు వల్ల. జూబ్లీహిల్స్ రోడ్ నెం.67లో నివాసముంటున్న కృష్ణా రెడ్డి జూబ్లీ హిల్స్ యూనియన్ బ్యాంక్ బ్రాంచికి వెళ్లారు. లాకర్ రూమ్‌లోకి వెళ్లిన కృష్ణా రెడ్డిని గమనించకుండా సిబ్బంది తాళాలు వేసుకుని వెళ్లారు. కృష్ణా రెడ్డి ఆ రోజు ఫోన్ కూడా మర్చిపోవడంతో రాత్రంతా లాకర్ రూమ్‌లోనే గడపాల్సి వచ్చింది. బ్యాంకుకు వెళ్లిన తమ తండ్రి ఇంకా రావడం లేదని అతడి కుమారుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా అసలు విషయం బయటపడింది. కృష్ణా రెడ్డి రాత్రంతా లాకర్ రూమ్‌లోనే గడిపి స్పృహ కోల్పోయాడు. అతడిని దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.