తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ’ యాత్ర చేస్తున్న సంగతి తెలిసింది. ఈ యాత్ర నేటితో ముగియనుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని తుక్కుగూడలో సభ నిర్వహించనున్నారు. ఈ ముగింపు సభకు హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. అమిత్ షా ఈ సభకు హాజరు కావడంతో.. అతనిపై MLC కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. 3 వేల ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ బకాయిలు ఎలా చెల్లిస్తారని, బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్, GST పరిహారం సంగతేంటి, పెరుగుతున్న ద్రవ్యోల్బనంపై మీ సమాధానం ఏమిటి ?, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెరిగిన నిరుద్యోగం, మతపరమైన సమస్యల సంగతేంటి అని ప్రశ్నించారు.