ఆడపిల్ల పుట్టిందన్న ఆనందంలో తల్లిదండ్రులు పసిపాపను రథంపై ఊరేగించారు. ఈ ఘటన పంజాబ్లోని అమృత్సర్లో జరిగింది. పట్టణానికి చెందిన సాగర్, జాన్వీ దంపతులకు ఇటీవల ఆడపిల్ల పుట్టింది. దీంతో వారు సంతోషం పట్టలేక హాస్పిటల్ నుంచి రథంపై ఊరేగిస్తూ ఇంటికి తీసుకెళ్లారు. మేళతాళాలు, బంధువులు, స్నేహితుల కోలాహలం నడుమ ఈ వేడుక నిర్వహించారు. తమ ఇంట్లో ఆడపిల్ల పుట్టడం సంతోషంగా ఉందని, ఆడబిడ్డ తమ ఇంట్లో మహాలక్ష్మిగా భావిస్తామని వారు చెప్పుకొచ్చారు.