TS: హైదరాబాద్ పరిధిలోని కొంపల్లిలో 8 ఏళ్ల బాలుడిని ఎలుక కరిచింది. మెక్‌డొనాల్డ్స్‌కి చెందిన ఓ దుకాణంలో తండ్రితో కలిసి బాలుడు భోజనం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. బాలుడి కాళ్లపై నుంచి పైకి ఎక్కి తొడ భాగంలో కరిచింది. దీంతో బాలుడు తీవ్ర ఆవేదన చెందడంతో ప్యాంటు విప్పి ఎలుకను తరిమేశారు. ఈ ఘటనపై బాలుడి తండ్రి హోటల్‌పై ఫిర్యాదు చేశాడు. అనంతరం బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి తండ్రి టీకాను వేయించారు. కాగా, అంబర్‌పేట్‌లో బాలుడిపై వీధికుక్కలు దాడి చేయడం కలకలం రేపిన కొద్దిరోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్