ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఓ రికార్డు ఊరిస్తోంది. ఈ టెస్టులో జడ్డూ మరో 4 వికెట్లు తీసుకుంటే సొంతగడ్డపై 300 వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా ఘనత సాధిస్తాడు. అంతర్జాతీయ మ్యాచుల్లో సొంతగడ్డపై జడేజా 296వికెట్లు తీసుకున్నాడు. అనిల్ కుంబ్లే(476), అశ్విన్(416), హర్భజన్(380), కపిల్ దేవ్(316) జడ్డూ ముందున్నారు. కెరీర్‌లో 14వేలకు పైగా పరుగులు, 503 వికెట్లతో భారత్ తరఫున అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా జడేజా నిలుస్తున్నాడు. మరోవైపు, 9 పరుగులు చేస్తే ఆసీస్‌పై 2000 పరుగులు చేసిన ఆటగాడిగా పుజారా ఘనత సాధిస్తాడు.