ఏపీ ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బాలయ్య స్పందించారు. టీడీపీ విజయదుందుభి మొదలైందని ఆయన పేర్కొన్నారు. ఇకపై వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో వ్యతిరేకత తప్పదని చెప్పారు. కాగా పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్‌లు భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు.