నదిలా మారిన హైవే!

భారీ వర్షాల కారణంగా వరదలు ఉప్పొంగడంతో ఢిల్లీలోని ఎన్‌హెచ్-48 నదిని తలపిస్తోంది. ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. వాహనదారులు, పాదచారులు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులపై నడుముల లోతు నీరు ప్రవహిస్తుండడంతో వాహనాలు వెళ్లటానికి కూడా వీలు లేకుండా పోయింది. మరో వైపు రహదారిలోనే వాహనాలు బ్రేక్ డౌన్ అవుతున్నాయి. దీంతో ట్రాన్స్‌పోర్ట్ సమస్య మరింత పెరిగింది. స్థానిక పోలీసులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు.

Exit mobile version