పిల్లల కోసం పోస్టాఫీస్‌లో అదిరిపోయే స్కీమ్

© ANI Photo

ఇండియన్ పోస్టాఫీస్‌లో ఎన్నో మంచి మంచి స్కీం‌లు అంబాటులో ఉంటాయి. తాజాగా పిల్లల కోసం ఓ అద్భుతమైన స్కీంను పోస్టాఫీస్ తీసుకుంది. అదేంటంటే పదేళ్లు, ఆపై వయసున్న మీ పిల్లల పేరు మీద ఏదైనా పోస్టాఫీస్‌లో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కింద ఖాతా ఓపెన్ చేయాలి. అందులో కనిష్టంగా రూ.1000 నుంచి గరిష్టంగా రూ.4.5లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు. మీరు డిపాజిట్ చేసిన మొత్తానికి 6.6 శాతం వడ్డీ ప్రతినెలా మీ ఖాతాలో జమ అవుతుంది. ఈ స్కీం మెచ్యూరిటీ 5 సంవత్సరాలు కాగా.. 5 సంవత్సరాలు పూర్తయ్యాక మీరు మీ డిపాజిట్ తీసుకోవచ్చు.

Exit mobile version