బర్మింగ్‌హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా నేడు ఇండియా ఉమెన్స్, పాకిస్థాన్ ఉమెన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 100 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టులో స్మృతి మందాన(63) అద్భుతంగా రాణించింది. దీంతో కేవలం 11.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పొయి ఇండియా విజయం సాధించింది. అటు పాక్ బౌలర్లలో టూబా హస్సన్ ఒక వికెట్ తీసుకుంది.