ఓ ఆరేళ్ల చిన్నారి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశాడు. ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలని పోలీస్ అధికారులను కోరాడు. ఈ సంఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. ఓ ప్రైవేటు స్కూల్లో యూకేజీ చదివే ఆ పిల్లాడు తన పాఠశాల వద్ద ఎక్కువగా వాహనాలు ఆగి ఉన్నాయని , ట్రాక్టర్లు అడ్డుగా ఉంచారని పేర్కొన్నాడు. అంతేకాదు అందరూ పోలీసులు రావాలని, వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేయాలని సూచించాడు. అతడి తీరుకు ముచ్చటపడిన పోలీసులు..పిల్లాడికి మిఠాయి తినిపించి పంపించినట్లు తెలిసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతుంది.