వింబుల్డన్ విజేత రోజర్ ఫెదరర్ తనకు జరిగిన ఓ వింత అనుభవం గురించి పంచుకున్నారు. “కుటుంబంతో కలిసి సౌత్ వెస్ట్ లండన్‌లో వింబుల్డన్ వెళ్లాను. అక్కడ డాక్టర్‌ను కలిసిన తర్వాత చాలా సమయం ఉండటంతో కాలక్షేపం కోసం దగ్గర్లో ఉన్న టెన్నిస్ క్లబ్‌కు వెళ్లి టీ తాగుదాం అనుకున్నాం. నేను క్లబ్ గేటు దగ్గరసెక్యూరిటీ దగ్గరకు వెళ్లి లోపలికి ఎలా వెళ్లాలని అని అడిగాను. మెంబర్షిప్ కార్డు ఉందా అని ఆమె ప్రశ్నించింది. వింబుల్డన్ గెలిస్తే కార్డు ఇస్తారని తనకు అప్పటివరకు తెలీదు ” అని అన్నాడు.