బాలుడిపై మదర్సాలో టీచర్ లైంగిక వేధింపులు

© Envato

హైదరాబాద్‌ సంతోష్ నగర్‌లోని మదర్సాలో 14 ఏళ్ల బాలుడిపై 21 ఏళ్ల కేర్‌టేకర్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలుడు తన అత్తకు వేధింపుల గురించి తెలుపగా, ఆమె సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విచారించిన పోలీసులు బాలల లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం (పోక్సో) కింద అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. బాలుడిని పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇతర విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో నివసిస్తున్న కేర్ టేకర్ గత రెండు నెలలుగా పలువురిని లైంగిక వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది.

Exit mobile version