కామారెడ్డిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం రాత్రి బండి సంజయ్ పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ ముట్టడికి బయల్దేరారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట, ఘర్షణ చోటుచేసుకున్నాయి. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై ప్రభుత్వంపై తేల్చుకుంటామని బండి సంజయ్ ప్రకటించారు. అంతకుముందు బండి సంజయ్, అడ్లూర్ ఎల్లారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని కలిసి పరామర్శించారు