సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. జిన్నార మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని మైలాన్ పరిశ్రమలో వేర్‌హౌస్ బ్లాక్‌లో మంటలు చెలరేగి ముగ్గురు చనిపోయారు. అసిస్టెంట్ మేనేజర్ లోకేశ్వరరావు, బెంగాల్‌కు చెందిన కార్మికుడు పరితోష్ మెహతా, బిహార్ వాసి రంజిత్ కుమార్ మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్పివేేశారు.