హనుమకొండ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగ దొరికిన తీరు ఆశ్చర్యపరిచింది. హసన్‌పర్తిలోని ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల గర్ల్స్ హాస్టల్‌లో సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లో చోరీ చేస్తున్న అతడు పొలాల నుంచి పారిపోతుండగా అక్కడే ఉన్న బావిలో పడ్డాడు. గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాడు సహాయంతో బయటకు తీసి స్టేషన్ తరలించారు. బాత్‌రూమ్ డోర్స్ పగులగొట్టి హాస్ట్‌లోకి ప్రవేశించాడు. మూడ్రోజుల వ్యవధిలో 14 ఫోన్‌లు అపహరించాడని విద్యార్థులు తెలిపారు.