హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఉత్కంఠ విజయం సాధించింది. 12 పరుగుల తేడాతో కివీస్‌ను ఓడించింది. కివీస్ ఆటగాడు మైఖేల్ బ్రేస్‌వెల్ అద్భుత సెంచరీ (144)తో భారత్‌ను వణికించాడు. విజయం అంచులదాకా తీసుకెళ్లి అవుటయ్యాడు. న్యూజిలాండ్ 49.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. కీలక సమయంలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ వికెట్లు పడగొట్టడంతో భారత్ విజయం సాధించింది.