పబ్ రేప్ కేసులో కీలక మలుపు

© ANI Photo

TS: జుబ్లీహిల్స్ పబ్ రేప్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లను మేజర్లుగా గుర్తించాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారిలో మెచ్యూరిటీ లెవల్స్ అధికంగా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కారణంగా నిందితులను మేజర్లుగా గుర్తించాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై నాంపల్లి న్యాయస్థానం త్వరలో విచారణ చేపట్టనుంది. ఈ కేసులో ఓ ఎమ్మెల్యే కొడుకు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

Exit mobile version