రేపు ఉదయం 7గంటలకు హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్, భారత్‌ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఇందులో గెలిస్తేనే సిరీస్‌పై భారత్ ఆశలు సజీవంగా ఉంటాయి. దీంతో తొలి వన్డేలో ఘోర పరాభవం అనంతరం పుంజుకోవాలని భారత్ ఉవ్విల్లూరుతోంది. తప్పిదాలను సవరించుకుని, మైదానంలో ప్రణాళికలను మరింత మెరుగ్గా అవలంబించాలని టీమిండియా భావిస్తోంది. బ్యాటింగులో ఫర్వాలేదనుకున్నా, బౌలింగులో మాత్రం జట్టు మెరుగు పడాల్సి ఉంది. తొలి వన్డేలో చోటు కోల్పోయిన దీపక్ హుడా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, మ్యాచ్‌కు వరుణుడు ముప్పు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.