ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని సినీ హెయిర్ స్టైలిస్ట్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు వివరాల ప్రకారం..నందినగర్‌లో నివాసముంటున్న మహిళ హెయిర్ స్టైలిస్ట్‌గా పనిచేస్తోంది. 2018లో ఆమెకు మరో హెయిర్ స్టైలిస్ట్ మహేశ్‌తో పరిచయం ఏర్పడింది. మహేశ్ ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత నెల్లూరు షూటింగ్‌కు వెళ్లిన సమయంలో శారీరకంగా ఒక్కటయ్యారు. గత ఆగస్టులో బాధితురాలు పెళ్లి చేసుకోవాలని కోరగా, అప్పటినుంచి ఆమెను దూరం పెడుతున్నాడు. రోడ్డుపై పట్టుకుని నిలదీయగా భౌతిక దాడికి పాల్పడ్డాడు.