అమెరికాలోని సియాటెల్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీస్ వాహనం ఢీకొని 23 ఏళ్ల తెలుగు అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. మృతురాలు కర్నూలు జిల్లా అదోనికి చెందిన అమ్మాయిగా గుర్తించారు. కూతురి అకాల మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.