శర్వానంద్, రష్మిక జంటగా నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ ట్రైలర్ విడుదలైంది. పెళ్లి చూపులకు వెళ్లిన అమ్మాయిలకు వంకలు పెడుతూ హీరో ఇంట్లో ఉన్న ఆడవాళ్లు అన్ని పెళ్లిళ్లు చెడగొడతుంటే, దానితో విసిగెత్తిపోయిన హీరో పడుతున్న బాధలతో కామెడీ పండించారు. బ్రహ్మానందం కూడా ఈ సినిమాలో నటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మార్చి 4న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. తిరుమల కిశోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సీనియర్ హీరోయిన్లు రాధికా, ఖుష్బూ వంటివాళ్లు చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.