‘సిమ్ కోసం ఆధార్ తప్పనిసరి కాదు’

Screengrab Twitter:

కొత్త సిమ్ కార్డ్, బ్యాంక్ ఖాతా తీసుకోవాలంటే ఆధార్ ఇవ్వడం తప్పనిసరి కాదని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) పేర్కొంది. దేశంలో వ్యక్తిగత భద్రత, ద్రువీకరణ కోసం మాత్రం ఇవ్వడం ఉత్తమమని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు, నేరగాళ్లు అనేక సిమ్ కార్డులు తీసుకుంటున్నట్లు గుర్తుచేశారు. ఇలాంటి సందర్భాలలో ద్రువపత్రాలు ఆధార్‌తో లింక్ అయి ఉండటం వల్ల నేరగాళ్లను సులువుగా గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపింది. మరోవైపు మొబైల్ కంపెనీలు, ఇతర సంస్థలు ఆయా కస్టమర్ల బయోమెట్రిక్ వివరాలను స్టోర్ చేయోద్దని స్పష్టం చేసింది.

Exit mobile version