బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబందించిన షూటింగ్ చాలాకాలం క్రితమే పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని బాషల్లో చక్కగా కుదిరేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ప్రధాన తారాగణానికి సంబంధించిన డబ్బింగ్ పూర్తయింది. అయితే తర్వలో సినిమా టీజర్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నాడు. మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.