టాలీవుడ్ సీనియర్ నటుడు సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ ‘తీస్ మార్ ఖాన్’ అనే మూవీలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో పోలీస్ పాత్రలో ఆది కనిపిస్తున్నాడు. ఫుల్ ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈ సినిమాను తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.