అమీర్ ఖాన్ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

Courtesy Twitter:@vijayashanthi_m

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ పై బీజేపీ నేత విజయశాంతి చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ప్రజల్ని అమాయకులుగా భావించి నోటికొచ్చినట్టు మాట్లాడితే… ఆ పరిణామాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ గారికి జనం అర్థమయ్యేలా చేస్తున్నారు. బీజేపీ సర్కారుపై గుడ్డి వ్యతిరేకతతో భారతమాతను అవమానిస్తూ..2015లో ఆమీర్ చేసిన అసహన వ్యాఖ్యల ఫలితాన్ని ఇప్పుడాయన చూస్తున్నారు.లాల్ సింగ్ చడ్డా సినిమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రజలు అందర్నీ మేలుకొలుపుతున్నారు. దురదృష్టమేంటంటే…. జనం ఇంత చైతన్యంతో వ్యవహరిస్తున్నా మన సౌత్ హీరోలు కొందరు ఆ ప్రజల మనోభావాలు తమకు తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. అమీర్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు’ అని విమర్శించారు.

Exit mobile version