బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తాజాగా తన కుటుంబం, వృత్తి, వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. తాను తన కుటుంబం కంటే కెరీర్ కే ఎక్కువ సమయం కేటాయించానని పేర్కొన్నారు. కుటుంబం విషయంలో బాధ్యత తీసుకోలేకపోయానని అన్నారు. తన మొదటి భార్య రీనా దత్తా, వారి తల్లిదండ్రులు ఇటీవల విడాకులు తీసుకున్న రెండో భార్య కిరణ్ రావ్ తో పాటు ఆమె కుటుంబం, పిల్లలు ఇలా అందరితో తనతో అత్యంత సన్నిహితంగా ఉంటారని పేర్కొన్నారు. కిరణ్ రావ్ తో విడాకులపై మొదటి సారి నోరు విప్పిన అమీర్ జనాలు తమ గురించి అర్థం చేసుకోవడం లేదని అన్నారు. సాధారణంగా విడాకులు తీసుకున్న జంటలు ఒకరిని ఒకరు పట్టించుకోరని.. కానీ తాము వివాహ వ్యవస్థపై గౌరవంతో విడిపోయాక కూడా మంచి స్నేహితులుగా ఉండేలా నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఇద్దరు మాజీ భార్యలతో సత్సంబంధాలను కలిగి ఉన్నానని, అది నా అదృష్టం అని చెప్పుకొచ్చారు.