కాఫీ విత్ కరణ్ 7 షోకి ఇటీవల హాజరైన అమీర్ ఖాన్ తన ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్‌రావులతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఎంత బిజీగా ఉన్నా వారానికి ఒకసారి అందరం కలుస్తామని వెల్లడించారు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, గౌరవంతో ఒకే కుటుంబంగా ఉంటామని పేర్కొన్నారు. అమీర్ ఖాన్, రీనాను 1986లో పెళ్లి చేసుకుని 2002లో విడిపోయారు. ఇక కిరణ్ రావును అమీర్ 2005లో వివాహం చేసుకోగా, గత ఏడాది జూలైలో వీరు విడాకులు తీసుకున్నారు. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు జన్మించగా, రెండో భార్యకు ఒక బాబు ఉన్నాడు.