జనవరి 26న ఢిల్లీలోని ఎర్రకోటలో భారత గణతంత్ర వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సారి రిపబ్లిక్ వేడుకలకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్ సీసీ హాజరవుతున్నారు. ఈజిప్ట్ నుంచి వచ్చిత తొలి అతిథి ఈయనే. ఏదైనా కష్ట సమయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి తీసుకుంటారనే పేరు అతడికి ఉంది. అబ్దెల్ జనవరి 24నే ఇండియాకు వస్తున్నారు. ఈ సందర్భంగా భారత్-ఈజిప్ట్ మధ్య రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాలు చేసుకోనున్నారు.