రష్యా కొత్త అణ్వాయుధం సర్‌మాట్ బలాబలాలేంటీ

© Envato

ఉక్రెయిన్ మీద పట్టు సాధించేందుకు రష్యా కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తన కొత్త అణ్వాయుధం సర్‌మాట్‌ను ప్రయోగించేందుకు చూస్తోంది. సర్‌మాట్ క్షిపణిని సటన్2 అని కూడా పిలుస్తారు. ప్రపంచ దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా కానీ రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన కొత్త క్షిపణి అయిన సర్‌మాట్‌ను కూడా పరీక్షించింది. ఇది పదికంటే ఎక్కువ వార్ హెడ్‌లను మోసుకెళ్లే శక్తిని కలిగి ఉంది. 11 వేల నుంచి 18 వేల కిలోమీటర్ల రేంజ్‌లో ఉన్న ఎటువంటి లక్ష్యాలనైనా ఇది చేధించగలదని అధికారులు తెలిపారు. ఈ క్షిపణి పరీక్ష రష్యా శత్రువులను ఆలోచనలో పడేస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు.

Exit mobile version