ఆస్కార్ అవార్డుల వేడుకలో విల్ స్మిత్, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్రిస్ రాక్‌ను చెంపదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే రేగింది. అయితే ఈ సంఘటనపై చర్చించేందుకు అకాడమీ గవర్నర్ల బోర్డు బుధవారం సమావేశం నిర్వహించింది. అకాడమీ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించడంతో స్మిత్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని బోర్డు వెల్లడించింది. దీంతో విల్ స్మిత్‌కు ఇచ్చిన ఆస్కార్‌ను వెనక్కి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఏప్రిల్ 18న జరిగే బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది. ఈ ఘటనపై స్మిత్ లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని అకాడమీ ఆదేశించింది.