బాలివుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుండగా ప్రమాదం జరిగింది. వెంటనే ఆయన్ను కామినేని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ శివారులో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సింగం, గోల్మాల్ సిరీస్‌లతో రోహిత్ శెట్టి ఇండస్ట్రీ హిట్లో నమోదు చేశారు.