ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక సూత్రధారిగా ఉన్న గోల్డీ బ్రార్ అరెస్టైనట్లు తెలుస్తోంది. కెనడాలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాదిలో మేలో సిద్ధూ హత్యకు గురికాగా ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. హత్య ప్రణాళిక తమదేనని గోల్డీ బ్రార్ గతంలోనే ప్రకటించాడు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయి అరెస్ట్ తర్వాత గోల్డీ బ్రార్ కెనడా పారిపోయాడు. ప్రస్తుతం అక్కడే అతడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.