మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాను ముందు పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలని భావించినప్పటికీ మళ్లీ మనసు మార్చుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. కానీ ఆర్ఆర్ఆర్తో మంచి జోష్ మీద ఉన్న రామ్ చరణ్ ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా మూవీలో కనిపిస్తాడని ఆశించిన ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. గత డిసెంబర్లో రిలీజ్ కావాల్సిన సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. మొత్తానికి ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సమయం దగ్గర పడటంతో త్వరలో చిత్రబృందం ప్రమోషన్స్ చేపట్టనున్నట్లు తెలుస్తుంది.