‘ఆచార్య’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రంగం సిద్ధం

మెగాస్టార్ ‘ఆచార్య’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రంగం సిద్ధ‌మైంది. ఈ నెల 23న హైద‌రాబాద్‌లో ఈ వేడుకున్న నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 29న సినిమా విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 18న చిరంజీవి-చ‌ర‌ణ్ ఇద్ద‌రు క‌లిసి స్టెప్పులేసిన ‘భ‌లే భ‌లే బంజారా’ పాట‌ను విడుద‌ల చేయ‌నున్నారు. మ‌రోవైపు మెగాస్టార్ ట్విట్ట‌ర్ ఖాతా పేరును మార్చుకున్నారు. 2020లో ట్విట్ట‌ర్ ఖాతా ప్రారంభించిన చిరంజీవి అప్ప‌టినుంచి చిరంజీవి కొణిదెల అనే పెట్టుకున్నారు. అయితే తాజాగా ప్రొఫైల్ పేరును ఆచార్య‌గా మార్చుకున్నాడు.

Exit mobile version