రష్యా ఉప ప్రధాని పనితీరుపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అసహనం వ్యక్తం చేశారు. ఒకానొక దశలో వెర్రీ చేష్టలు చేస్తున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇటీవల క్రెమ్లిన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఉపప్రధాని డెనీస్ పాల్గొన్నారు. రష్యా ఎయిర్లైన్స్ సంస్థ ఏరోఫ్లోట్కు పౌర, సైనిక విమానాలు లీజుకు తీసుకునేందుకు డెనీస్ శాఖ నుంచి డబ్బులు విడుదల కావాలి. కానీ, జరగకపోవటంతో పుతిన్ ఆగ్రహించారని సమాచారం. ఈ విషయంపైనే గుర్రుగా కోపడ్డారని తెలుస్తోంది.