‘వారిసు’ సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యం లేకపోయినా నటించడంపై హీరోయిన్ రష్మిక స్పందించింది. విజయ్‌తో నటించడానికే కథకు ఓకే చెప్పినట్లు స్పష్టం చేసింది. అన్నీ తనకు తెలిసే జరిగాయని వివరణ ఇచ్చింది. ‘స్కోప్ లేకపోయినా పాత్రకు ఓకే చెప్పా. విజయ్ సర్‌తో నటించొచ్చని. అలాగే, సెట్‌కి వెళ్లి పనిచేయడం వల్ల కొన్ని విషయాలు నేర్చుకుంటాం. అలా చిన్న చిన్న విషయాలను నేర్చుకున్నా’ అంటూ రష్మిక క్లారిటీ ఇచ్చింది. ఇందులో రెండు పాటల్లో మాత్రమే రష్మిక చిందేసింది. అవి రెండూ మంచి స్పందనను రాబట్టడం విశేషం. తెలుగులో ‘వారసుడు’గా విడుదలైంది.
-
Courtesy Instagram: RashmikaMandanna
-
Screengrab Twitter: