AP: సంక్రాంతి పండుగ రద్దీ సమయాన్ని అదనుగా తీసుకుని అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలుంటాయని ప్రైవేటు బస్సు నిర్వాహకులను రవాణా శాఖ హెచ్చరించింది. 10 రోజుల పాటు కచ్చితంగా తనిఖీలు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించింది. రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. నిబంధనలను అతిక్రమించిన బస్సులను సీజ్ చేస్తామని తెలిపింది. ప్రయాణికులు కూడా రవాణాశాఖకు ఫిర్యాదు చేయొచ్చని ఈ సందర్భంగా సూచించింది. ఫిట్నెస్, ధ్రువపత్రాలు లేని వాటిని సీజ్ చేస్తామని ప్రకటించింది. ప్రైవేటు బస్సులు ఆర్టీసీ బస్స్టాండ్ల వద్ద వేచి ఉండొద్దని తెలిపింది.