నటుడు సునీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను రాజకీయాల్లోకి రావడం గురించి కీలక విషయాలు చెప్పాడు. అయితే తాను పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున భీమవరం నుంచి పోటీ చేస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగిందన్నాడు. అయితే తనను పార్టీలోకి తీసుకోవాలనుకున్నట్లు తెలిసిందన్నారు. కాని పవన్ అంటే తనకు ఇష్టమని చెప్పాడు. రాజకీయాల్లో రావడం ఇష్టం లేదని పేర్కొన్నాడు. ప్రజలందరిని సంతృప్తి చేయలేమని అన్నాడు. తనకు పాలిటిక్స్ సూట్ కావని స్పష్టం చేశాడు. మరో వైపు సునీల్ ప్రస్తుతం పుష్ప-2 మూవీలో నటిస్తున్నాడు.