కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూతురు దియా టాలెంట్ ను చూసి సూర్య అభిమానులే కాకుండా నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఇటీవలే 10వ తరగతి పూర్తి చేసుకున్న సూర్య కూతురు బోర్డ్ ఎగ్జామ్ లో 500 మార్కులకు గాను 487 మార్కులు సాధించింది. దీంతో ప్రతి ఒక్కరూ సూర్య కూతురా మజాకా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొన్నే వచ్చిన విక్రమ్ సినిమాలో సూర్య రోలెక్స్ రోల్ లో కనిపించి అందరి చేత విజిల్స్ వేయించాడు. సూర్య సినిమాలు తమిళంలోనే కాకుండా తెలుగు నాట కూడా పెద్ద హిట్లుగా నిలుస్తున్నాయి.