తమిళ నటి గాయత్రి రఘురామ్ బీజేపీకి రాజీనామా చేేశారు. పార్టీలో మహిళలకు తగిన గౌరవం, ప్రాధాన్యత దక్కడం లేదంటూ ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామళై సారథ్యంలో అతివలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. భారమైన హృదయంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తన అనుచరులకు సమాచారం అందించారు. అయితే ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని..గతేడాది నవంబర్లోనే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. హిందూ ధర్మం నా గుండెల్లో ఉంది, దీనికోసం రాజకీయ పార్టీలో వెతుక్కోవాల్సిన అవసరం నాకు లేదని ఆమె ట్వీట్ చేశారు.