అలనాటి నటి మీనా ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరోనా తరువాత వచ్చే సమస్యలతో బాధ పడుతున్న ఆమె భర్త విద్యాసాగర్ హఠాత్తుగా మృతి చెందాడు. కరోనా తరువాత ఊపిరితిత్తులలో సమస్య కారణంగా ఆయన బాధపడుతున్నాడు. దీంతో గతకొద్ది రోజులుగా చెన్నైలోని MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మీనా కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.