అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ సంపందలోనే కాదు సమాజసేవలోనూ టాప్ అని నిరూపిస్తున్నారు. తన తండ్రి 100వ జయంతి, తన 60వ పుట్టినరోజును పురస్కరించుకుని రూ.60 వేల కోట్లు సమాజసేవకు కేటాయించారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మొత్తాన్ని ఆరోగ్యం, విద్య మరియు నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల కోసం ఖర్చు చేయనున్నారు. ఆసియా ధనవంతులలో ఒకరైన గౌతమ్ అదానీ జూన్ 24వ తేదీన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అదానీ ఫౌండేషన్ ద్వారా ఈ విరాళం ఖర్చు చేయనున్నారు.