టాలీవుడ్లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న వేళ ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ కూడా ఓ సినిమా రీ రిలీజ్ చేయబోతున్నాడు. అయితే అదేదో తన సూపర్ హిట్ సినిమా అయిన ‘శివ’ కాదు. అత్యంత చెత్త సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నాడు. నితిన్, నిషా హీరో, హీరోయిన్లుగా తెరకెక్కి 2009లో విడుదలైన ‘అడవి’ సినిమాను అక్టోబర్ 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రం అప్పట్లోనే పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. నితిన్ కెరీర్లో జీరో షేర్లతో ముగిసిన ఏకైక సినిమా ఇది. దీనిని ఆర్జీవీ విడుదల చేయడంపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు.
దసరాకు ‘అడవి’ సినిమా రీ రిలీజ్
